చారిత్రక ఐరాస​ సమావేశాల్లో మోదీ కీలక ప్రసంగం

మరికొన్ని రోజుల్లో ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ చారిత్రక సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రెండు ఉన్నతస్థాయి చర్చల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి వెల్లడించారు.

“ఈసారి జరగనున్న యూఎన్​ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో అనేక హైలైట్స్​ ఉన్నాయి. భారత్​కు సంబంధించి.. ఈ 21 నుంచి రెండు ఉన్నత స్థాయి చర్చల్లో ప్రధాని పాల్గొననున్నారు. ముందుగా.. 21న ఐరాసలో భారత తరఫున ప్రసంగించనున్నారు మోదీ. అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చలు జరపనున్నారు.”

— టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి

మరోవైపు ఈ నెల 30న ఐరాసలో బయోడైవర్సిటీ సదస్సు జరగనుందని తిరుమూర్తి వెల్లడించారు. “అర్జెంట్​ యాక్షన్​ ఆన్​ బయోడైవర్సిటీ ఫర్​ సస్టైనబుల్​ డెవలప్​మెంట్​” దీని థీమ్​ అని పేర్కొన్నారు. ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ పాల్గొననున్నట్టు స్పష్టం చేశారు.

ఈసారికి ఇలా..

ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి వార్షిక సాధారణ సమావేశాల్ని వర్చువల్​గా నిర్వహించనున్నారు. దేశాధినేతలు ఎవరూ ఈ సమావేశానికి నేరుగా హాజరు కావడం లేదు. న్యూయార్క్​లో జరగనున్న ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే నేరుగా హాజరయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This