‘మాతృభాషలో విద్యాబోధనతోనే మానసిక వికాసం’

మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక వికాసంలో కీలకపాత్ర వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య ఇంటి/స్థానిక భాషలోనే కొనసాగాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలు ఇదే విషయాన్ని విశదీకరిస్తున్నాయని వివరించారు.’21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అన్న అంశంపై రెండు రోజుల పాటు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన జాతీయ సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ప్రసంగించారు. 2018లో అంతర్జాతీయ విద్యార్థుల మదింపు కార్యక్రమం (పీసా)లో టాప్‌ ర్యాంకుల్లో ఉన్న ఎస్టోనియా, ఐర్లాండ్‌, ఫిన్‌ల్యాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, పోలండ్‌లు తమ పిల్లలకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన చేస్తున్నాయని తెలిపారు మోదీ. నూతన విద్యావిధానం వచ్చిన తర్వాత పిల్లల బోధన ఏ భాషలో ఉంటుంది? అందులో ఏం మార్పులు తెస్తున్నారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.

“భాష అన్నది బోధనా మాధ్యమమే తప్ప భాషే మొత్తం విద్య కాదన్న శాస్త్రీయ సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ భాషలో అయితే పిల్లలు సులభంగా చదువుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటారో అదే బోధనా భాషగా ఉండాలి. చదువు చెప్పేటప్పుడు మనం చెప్పేది వాళ్లు అర్థం చేసుకుంటున్నారా? లేదా? అన్నది చూడాలి. ఒకవేళ అర్థం చేసుకుంటుంటే ఎంత సులభంగా అర్థం చేసుకుంటున్నారన్నది గమనించాలి. చెప్పే విషయం కంటే భాషను అర్థం చేసుకోవడానికే పిల్లలు తమ శక్తిసామర్థ్యాలన్నింటినీ ధారపోసే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొనే చాలా దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే చెబుతున్నారు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This