మోదీ, షాపై అభ్యంతరకర పోస్ట్​లు.. నలుగురు అరెస్ట్​

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాలకు సంబంధించి వాట్సాప్​లో అభ్యంతకర పోస్ట్​లు పంపిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో జరగ్గా.. స్థానిక భాజపా నాయకుడు సత్యేంద్ర గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు నగర పోలీస్​ సూపరింటెండెంట్​ ముఖేశ్​ చంద్ర మిశ్రా తెలిపారు.

పట్టుబడ్డ నలుగురు నిందితులు.. యూపీ- హజ్రత్​గంజ్​లోని ఆర్డినెన్స్​ ఎక్విప్​మెంట్​ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ పోస్ట్​ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఫార్వర్డ్​ అయ్యింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This