ఆ ఎమ్మెల్యే మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

భారతీయ జనతా పార్టీ(భాజపా) సీనియర్​ నాయకురాలు, మాజీ మంత్రి కిరణ్​ మహేశ్వరి కరోనాతో మృతిచెందారు. రాజస్థాన్​లోని రాజ్​సమంద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్వరి.. ఈ నెల 28న కొవిడ్​-19 బారినపడ్డారు. హరియాణాలోని మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కిరణ్​ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1961 అక్టోబర్​ 29న జన్మించిన మహేశ్వరి.. భాజపా తరఫున ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజస్థాన్​ రాష్ట్ర కేబినెట్​ మంత్రిగానూ పనిచేశారు మహేశ్వరి.

ప్రధాని సంతాపం

ఎమ్మెల్యే కిరణ్​ మహేశ్వరి మృతిపై ఆమె కుటుంబానికి సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. మహేశ్వరి అకాల మరణంతో దిగ్భ్రాంతి చెందినట్టు చెప్పిన ఆయన.. రాష్ట్ర ప్రగతి కోసం, అట్టడుగు స్థాయి వర్గాల కోసం ఆమె ఎనలేని కృషి చేశారని ట్వీట్​ చేశారు.

197కు పడిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య

కిరణ్​ మహేశ్వరి మరణంతో 200 మందితో కూడిన రాజస్థాన్​ శాసనసభ్యుల సంఖ్య 197కు తగ్గింది. అంతకుముందు ఎమ్మెల్యే కైలాశ్​ త్రివేది, మంత్రి మాస్టర్​ భన్వర్​లాల్​ మేఘవాల్​ కూడా మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This