బ్యాంక్​కు వెళ్లిన అక్కాచెల్లెళ్లు అదృశ్యం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన జగదీశ్వర్​కు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు స్వప్నకు పెళ్లవ్వగా.. రెండో కూతురు అనూష విడాకులు తీసుకోవడం వల్ల తండ్రి వద్దే ఉంటోంది. మూడో కూతురు మనీషా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.

జూన్​ 4న జగదీశ్వర్​ భార్యతో కలిసి పని మీద బయటకి వెళ్లారు. సాయంత్రం వచ్చి చూసేసరికి అనూష, మనీష కనిపించలేదు. బ్యాంక్​కు వెళ్తున్నామని పక్కింటివాళ్లకు చెప్పినట్లు తెలిపారు. రెండో రోజు సాయంత్రం వరకు వారి కోసం వెతికిన తండ్రి పటాన్​చెరు పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This