‘కేటీఆర్.. ప్రజలకు నువ్వు మరింతకాలం సేవ చేయాలి’

తెలంగాణ యువనేత కేటీఆర్.. 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి… మరింత కాలం ప్రజలకు అందుబాటులో ఉండి, కేటీఆర్ సేవ చేయాలని రాసుకొచ్చారు.

“డియర్ కేటీఆర్ హ్యాపీ బర్త్​డే.. తెలంగాణ పౌరులకు నువ్వు అందుబాటులో ఉన్న విధానానికి కృతజ్ఞతలు. వారికి వ్యక్తిగతంగా సహాయం చేయడం, భరోసా ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరింతకాలం వారికి నువ్వు సేవచేయాలని మనసారా కోరుకుంటున్నాను” అని చెబుతూ చిరు ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This