చిరు నిర్ణయంపైనే ఆ విషయం ఆధారపడి ఉంది!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్​ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్​ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ చిత్రం తర్వాత చిరు రెండు రీమేక్ చిత్రాలు చేయనున్నారు. వీటిలో ఒకటి వివి వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ కాగా మరొకటి మెహర్ రమేష్​తో ‘వేదాళం’ రీమేక్. వీటిలో ఏ చిత్రం ముందుగా మొదలు కానుందో స్పష్టత లేదు. అయితే దీనిపై తుది నిర్ణయం చిరు మీదనే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు చిత్రాల స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This