మెగాస్టార్ తోటమాలిగా.. కెమెరా పట్టిన మరో మెగాస్టార్

కరోనా లాక్​డౌన్​ అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నిత్యం షూటింగ్​లతో బిజీగా ఉండే తారలకు, ఎంతో తీరిక సమయం దొరికింది. కొందరు కుటుంబంతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు గత స్మృతులను గుర్తు తెచ్చుకొని వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. వీరిలో కొంతమంది తమ పాత అభిరుచులవైపు అడుగులేస్తున్నారు. సూపర్​స్టార్​ మమ్ముట్టి ఫొటోగ్రఫర్​గా మారగా, మెగాస్టార్​ చిరంజీవి తోటమాలి అవతారమెత్తారు. ముద్దుగుమ్మ సమంత అక్కినేని సొంతంగా తన ఇంట్లోనే క్యాబేజీ పండిస్తోంది. వీరితో పాటే ఇతర నటీనటులు ఏమేం చేస్తున్నారో చూసేద్దాం.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నమెగాస్టార్ చిరంజీవి.. కరోనాపై అవగాహనతో పాటు, సినీ పరిశ్రమలోని విశేషాలను ఎప్పటికప్పుడూ తెలియజేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని సందేశమిస్తూ.. ఉద్యానవనంలో మొక్కలకు నీరు పోస్తున్న ఫొటోను ఇటీవలే షేర్​ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This