‘ఆచార్య’ తర్వాత ‘వేదాళం’ రీమేక్​ పట్టాలెక్కుతుందా?

‘ఆచార్య’ చిత్రం తర్వాత చిరంజీవి ఏ సినిమా చేయనున్నారు? – ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ముగ్గురు దర్శకులకు చిరంజీవి పచ్చజెండా ఊపారు. వాళ్లంతా ఇప్పుడు స్క్రిప్టు పనులతో బిజీ బిజీగా ఉన్నారు. మెహర్‌ రమేశ్​ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా ఆయన ఈ సినిమా రూపొందించనున్నారు.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించబోతోంది. స్వరాలు సమకూర్చే బాధ్యతని మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్‌కు అప్పజెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇందులో సాయిపల్లవి ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ఇటీవల గుండుతో కనిపించారు. అది ఈ సినిమా మేకప్‌ టెస్ట్‌ల్లో భాగమే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This