ఫిక్సింగ్ ఆరోపణలతో.. ఇద్దరు క్రికెటర్లు అరెస్ట్

ఫిక్సింగ్ భూతం మరోసారి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో ఫిక్సింగ్ చేశారనే ఆరోపణలతో ఇద్దరు క్రికెటర్లను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్​ పోలీసులు అరెస్టు చేశారు. ‘బళ్లారి టస్కర్స్’ కెప్టెన్ సీఎం గౌతమ్.. అతడి సహచరుడు అబ్రార్ ఖాజీని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

2019 ఆగస్టు 31న బళ్లారి – హుబ్లీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​ కోసం వీరిద్దరూ భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఫిక్సింగ్​కు పాల్పడ్డారని కేసు విచారణ చేస్తోన్న అధికారి ఒకరు తెలిపారు.

“కేపీఎల్​లో ఫిక్సింగ్ చేసినందుకు ఇద్దరు క్రికెటర్లను అరెస్టు చేశాం. ఆగస్టులో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసేందుకు వీరు రూ.20 లక్షలు తీసుకున్నారని తెలిసింది. బెంగళూరుతో జరిగిన మరో మ్యాచ్​లోనూ ఫిక్సింగ్​కు​ పాల్పడ్డారనే అనుమానం ఉంది” – విచారణాధికారి

ఈ వారంలో ఇలా ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. బెంగళూరు ఆటగాడు నిశాంత్ సింగ్ షెకావత్, బెళగావి జట్టు యజమానితో పాటు మరో ముగ్గురుని అదుపులో తీసుకున్నారు. అక్టోబర్​ 26న ‘బెంగళూరు బ్లాస్టర్స్’​ బౌలింగ్ కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్​మన్ విశ్వనాథన్​ను​ ఈ ఆరోపణలతో అరెస్టు చేశారు.

గౌతమ్, అబ్రార్ ఖాజీ దేశవాళి మ్యాచ్​లతో పాటు ఐపీఎల్​లోనూ ఆడారు. దేశవాళిలో గౌతమ్.. గోవాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అబ్రార్​.. మిజోరం తరఫున ఆడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This