మాస్కు తప్పనిసరి: అగ్రికల్చర్​ ఎంసెట్ పరీక్ష ప్రారంభం

నేడు, రేపు రెండు రోజుల పాటు జరగాల్సిన ఎంసెట్​ అగ్రికల్చర్​ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్ పరీక్ష జరగ్గా.. రెండో పేపర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కొవిడ్ నేపథ్యంలో ప్రతి విద్యార్థిని మాస్కు ధరించి శానిటేషన్ చేసుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 84 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 67, ఏపీలో 17 కలిపి మొత్తం 84 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. గతంలో ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాలకు ఒకే దఫాలో నిర్వహించగా.. ఈ ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా.. వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This