వాల్వ్​ మాస్కులతో ప్రమాదమెంత.. ఫేస్‌ షీల్డ్​తో భద్రతెంత?

కరోనా ఇంతలా విజృంభిస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో చాలామంది మాస్క్‌ల పట్ల శ్రద్ధ చూపడంలేదు. ఇదే విషయమై ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు ఇచ్చినా పాటించడంలేదు.

కొందరు పేరుకి మాస్క్‌ ధరించినా… తలపైకో, గొంతు కిందకో లాగేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లోనూ మాస్క్‌ లేకుండా ఎదురెదురుగా నిల్చుని ముచ్చటిస్తున్నారు.

‘‘కరోనా సోకి, లక్షణాలు కనిపించని వ్యక్తి, ఆరోగ్యవంతునికి సన్నిహితంగా వచ్చినా… ఇద్దరూ మాస్క్‌ ధరించి ఉంటే కరోనా సంక్రమించే అవకాశం 1.5% మాత్రమే. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి.

మాస్క్‌ పెట్టుకోని వారితో మాట్లాడకండి. మీ సమీపంలోనే రానివ్వకండి’’ అని స్పష్టం చేస్తున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డా।। కొడాలి జగన్మోహన్‌రావు. ఆయనతో ‘ఈనాడు-ఈటీవీ భారత్ ముఖాముఖి..

చాలామంది వాల్వులు ఉన్న మాస్కులు మరింత రక్షణ ఇస్తాయని నమ్ముతున్నారు. అది నిజమేనా?

‘‘మార్కెట్‌లో ఎన్‌-95, మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌, ఎఫ్‌ఎఫ్‌పీ1 మాస్కులు లభిస్తున్నాయి. ఇవన్నీ సురక్షితమైనవే. వైరస్‌ల నుంచి 95% వరకు రక్షణ కల్పిస్తాయి. బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి కణాలు, పుప్పొడులను 100%-80% వరకు నిలువరిస్తాయి.

గుడ్డతో చేసిన మాస్క్‌లూ మేలే చేస్తాయి. కానీ వీటిలో వాల్వ్‌ ఉండే మాస్క్‌లతో కొన్ని ఇబ్బందులున్నాయి. వాల్వు మాస్కులను ధరించిన వ్యక్తికి పూర్తి రక్షణ లభిస్తుంది.

మాస్క్‌ లోపల తేమ చేరదు. కానీ… వాళ్ల చుట్టుపక్కల ఉన్నవారికి మాత్రం అవి ప్రమాదకరం. ఆ మాస్క్‌ ధరించిన వ్యక్తి లోపలికి పీల్చుకునే గాలిని అది బాగానే వడపోస్తుంది. కానీ బయటకు విడిచే గాలిని మాత్రం వడపోయదు.

పైగా వారి శ్వాస నుంచి వెలువడే వైరస్‌లన్నీ ఒక్కసారిగా వాల్వ్‌ నుంచి వేగంగా బయటకు వస్తాయి. అది ఇతరుల్ని ప్రమాదంలోకి నెడుతుంది. అందువల్ల వాల్వులున్న మాస్కులు వాడొద్దు.

వస్త్రంతో చేసిన మాస్కులు మంచివేనా?

వస్త్రంతో చేసిన మాస్క్‌ను ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో సొంతంగా తయారు చేసుకోవచ్చు. సరిగా వాడితే ఎదుటి వ్యక్తుల నుంచి వెలువడే తుంపర్లను అవి పూర్తిగా అడ్డుకుంటాయి.

ఒకవేళ ఆ తుంపర్లలో వైరస్‌ ఉన్నా దాన్నుంచి రక్షణ ఇస్తాయి. గుడ్డ మాస్క్‌లను ప్రతి 6 గంటలకు ఒకసారి మార్చాలి. దీంతో పాటు ఫేస్‌ షీల్డ్‌ కూడా ధరిస్తే మరీ మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This