భారీ లాభాల్లో మార్కెట్లు.. 10 వేల మార్క్​ దాటిన నిఫ్టీ

లాభాల పరంపర..

అంతర్జాతీయ సానుకూలతలకు తోడు దేశీయంగా లాక్​డౌన్ సడలింపులు ఇవ్వడం, పారిశ్రామిక వర్గాలకు చేయూతనిస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడం వల్ల.. స్టాక్ మార్కెెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది.

సెన్సెక్స్​ దాదాపు 450 పాయింట్లు లాభపడి 34,273 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 140 పాయింట్లకుపైగా పుంజుకుని 10,124 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఓఎన్​జీసీ, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్, టీసీఎస్​, హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంఘై సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This