స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు.. 10,500పైకి నిఫ్టీ

లాభాల పరంపర..

స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం సెషన్​లో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 170 పాయింట్లకుపైగా పుంజుకుని 35,605 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల వృద్ధితో 10,528 వద్ద కొనసాగుతోంది.

ఏషియన్​ పెయింట్స్, ఐటీసీ, బజాజ్ ఆటో, టైటాన్​, రిలయన్స్, బజాజ్​ ఫినాన్స్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

పవగ్రిడ్​, హెచ్​సీఎల్​టెక్,  ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

భారత్​-చైనా మధ్య వివాదం సద్దుమణిగినట్లు వస్తున్న వార్తలకు తోడు అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, సియోల్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. హాంకాంగ్, టోక్యో సూచీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు ధరల సూచీ-బ్రెంట్ 0.52 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.41 డాలర్ల వద్ద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This