మణిపుర్​లో బాంబు పేలుడు.. ఐదుగురికి గాయాలు

మణిపుర్​ రాజధాని ఇంఫాల్​ నగరంలో ఐఈడీ బాంబు పేలింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు, ఓ పౌరునికి తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అప్రమత్తమైన సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో థంగల్​ బజార్​లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇంఫాల్​లో గత నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో దాడి కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This