మహేశ్​-మురుగదాస్​ కాంబినేషన్​లో మరో చిత్రం!

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా తమిళ దర్శకుడు ఏఆర్​ మురుగదాస్​తో మహేశ్​ ఓ సినిమాకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్​’ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది.

మహేశ్​బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రానికి పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా దర్శకుడు ఏఆర్​ మురుగదాస్​ కూడా హీరో విజయ్​తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మహేశ్​-మురుగదాస్​ కాంబినేషన్​లో రానున్న చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This