మహేశ్​బాబును భయపెట్టిన హారర్ సినిమా ఇదే

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు సినిమా విడుదలైందంటే చాలు అతని అభిమానుల సందడే వేరు. థియేటర్​కు వచ్చిన ఒక్కో చిత్రం కనీసం 100 కోట్లను వసూలు చేసి కానీ తిరిగి వెళ్లదు. అలాంటి మహేశ్​ మెచ్చిన చిత్రం.. అది కూడా అతడ్ని భయపెట్టిన సినిమా ఏంటో తెలుసా?.

ఇటీవల కాలంలో తనను ఎంతగానో భయపెట్టిన చిత్రం ‘ది సోషల్​ డైలమా’ అని మహేశ్​ ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. “ఒక ప్రేక్షకుడిగా, అభిమానిగా నేను ఎన్నో చిత్రాలను చూశా. కానీ నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన ‘ది సోషల్​ డైలమా’ నన్ను ఎంతగానో భయపెట్టింది. ఇప్పుడు కూడా ఆ సినిమా నాలో వణుకు పుట్టిస్తోంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.” అని మహేశ్​ ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.
వాస్తవానికి ఈ సినిమా హారర్​ నేపథ్యంలో తెరక్కింది కాదు. సామాజిక మాధ్యమాల వెబ్​సైట్ల వల్ల సంభవించే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This