సూపర్​స్టార్ మహేశ్​బాబు మెచ్చిన పుస్తకం

టాలీవుడ్‌ స్టార్ హీరో మహేశ్ బాబుకు పుస్తకాలు చదవడమంటే ఇష్టమనే విషయం చాలామందికి తెలుసు. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న ఇతడు.. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూనే పుస్తకాలను తిరగేస్తున్నారు. ఇటీవలే చదివిన ఓ పుస్తకం గురించి చెబుతూ రచయితను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

“రచయిత మనతో మాట్లాడుతున్నాడా అనేంతగా మనల్ని కథలో లీనమయ్యేలా చేసే పుస్తకాలు చాలా అరుదు. ఆ కోవకే చెందుతుంది ‘థింక్‌ లైక్‌ ఏ మాంక్‌’ పుస్తకం. జై శెట్టి మీరు రాక్‌ స్టార్‌” -ట్విట్టర్​లో మహేశ్

సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహేశ్.. ‘సర్కారు వారి పాట’ షూటింగ్​కు సిద్ధమవుతున్నారు. ఇందులో పొడుగాటి జుత్తుతో మాస్​లుక్​లో కనిపించనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This