క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!

ప్రేమించుకున్నవాళ్లు కరోనా కారణంగా దూరంగా ఉండటం వింటున్నాం. అయితే అదే వైరస్​ ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసింది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట.. లాక్​డౌన్​ కారణంగా తిరిగి స్వస్థలానికి వచ్చారు. ఆ తర్వాత క్వారంటైన్​ కేంద్రంలోనే ప్రేమపక్షులు వివాహం చేసుకొని జీవిత భాగస్వాములయ్యారు. ఒడిశాలోని నిమాపాడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

షాగాడ గ్రామానికి చెందిన సౌరభ్​ దాస్​, డెలాంగ్​కు చెందిన దీప్తి రాణీ దాస్​లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కుటుంబసభ్యులు వారి ప్రేమకు అంగీకారం తెలపకపోవడం వల్ల ఇద్దరూ గుజరాత్​కు​ పారిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన 4 నెలల అనంతరం కరోనాతో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారు. ఈ క్రమంలోనే మే 10న స్వగ్రామానికి తిరిగొచ్చిందీ జంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This