లాక్​డౌన్​ ఎఫెక్ట్​: బుజ్జి బొజ్జాయిలు ఎక్కువవుతున్నారు!

కరోనా వైరస్ ప్రపంచాని ఎంతటి భయాందోళనకు గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైరస్ ప్రభావం ప్రత్యక్ష్యంగానే కాదు పరోక్షంగా కూడా చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలకు పెద్ద ముప్పే తెచ్చింది. వివిధ రూపాల్లో దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. చేతిలో ఎక్కువ సమయం ఉండడం వల్ల రోజువారీ కార్యక్రమాలు చాలా మార్పులకు గురైయ్యాయి. దీనితో పిల్లలు, యుక్తవయస్తు వారిలో ఊబకాయ సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి పరిశోధనా ఫలితాలు.

41 మంది పిల్లలపై పరిశోధన

కరోనా పరిణామాలు ఏవిధంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని విషయాన్ని కనుక్కునేందుకు ఇంగ్లాడ్​లోని యూనివర్శిటీ ఆఫ్ బఫెలో పరిశోధనా బృందం ప్రయత్నించింది. పిల్లల జీవన శైలిలో వచ్చిన మార్పులు, ఆహారం, నిద్ర, శారీరక శ్రమ వంటి ముఖ్యమైన విషయాలు ప్రామాణికంగా తీసుకుని.. పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం… శరీర బరువు ఎక్కువగా ఉన్న 41 మంది పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వీరంతా… దీర్ఘకాలిక పరిశోధనల్లో భాగంగా పరిశీలనలో ఉన్నావారే. లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న రోజుల్లో రీజు వారీ కార్యక్రమాలు ఏ విధంగా మార్పులు జరిగాయని… దాని పరిణామాలేంటనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడే పిల్లల్లో రాబోయె కొద్ది కాలంలోనే తీవ్రమైన ఊబకాయ సమస్యలు వేధించబోతున్నట్లు వెల్లడైంది.

సాధారణ కంటే ఎక్కువే తింటున్నారు

అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో బడులు మూతపడ్డాయి. దీంతో పిల్లలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు 2, 3 నెలల నుంచి వారికి ప్రత్యేకంగా వేరే వ్యాపకం అంటూ లేకుండా పోయింది. ఆంక్షల వల్ల కనీసం బయటకు వచ్చేందుకు సైతం అవకాశం లేదు. దీంతో పూర్తిగా నాలుగు గోడల మధ్యలోనే గడుపుతున్నారు. ఈ సమయంలో… సాధారణ రోజుల్లో కంటే.. ఒక పూట భోజనం అధికంగా తీసుకుంటున్నారు, దీనికి అదనంగా చిరుతిళ్లు తీసుకుంటున్నారు. నిద్ర సమయాల్లో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. అర్థరాత్రి దాటాక నిద్రపోవడం బాగా అలవాటుగా మారింది. దీంతో సగటున అరగంట సమయం ఎక్కువగా నిద్రపోతున్నారు. ఎక్కువగా ఫోన్, టీవీ చూసేందుకు ప్రయత్నిస్తున్నారు . ప్రతి పిల్లవాడు సగటున 5 గంటలు ఇక్కడే గడుపుతున్నాట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు శీతల పానియాలు, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు పరిశోధనలో గుర్తించారు.

జీవనశైలిలో మార్పులు

ఈ కరోనా సమయంలోనే…. చిన్న, యుక్తవయసు పిల్లల జీవనశైలిలో గణనీయమైన మార్పులు స్పష్టంగా నిర్థారించారు పరిశోధకులు. ఎక్కువ కాలం ఇంట్లో ఉండడం వల్ల బరువు నియంత్రణలో అధ్వాన్న జీవనశైలి అవలంభిస్తున్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల వల్ల అంతర్జాతీయంగా దేశాలన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన బరువు, ఆహార శైలిలో మార్పులు వెనువెంట యథాస్థితికి తీసుకురావడం చాలా కష్టం. వీటి దుష్పరిణామాలు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు సృష్టించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This