లక్ష్మీపతి పాత్రకు తొలుత అనుకున్నదెవరినో తెలుసా?

పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోగల అతికొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విలన్‌గా, హాస్యనటుడిగా ఆయన విభిన్న పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలను చూస్తే, కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు ఆ పాత్రలను చేయలేరేమో అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో ‘అహనా-పెళ్లంట’లోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి.

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు. ఇక అరగుండు పాత్ర బ్రహ్మానందంతో కలిసి కోట పండించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. తొలుత లక్ష్మీపతి పాత్ర కోసం రావుగోపాలరావును అనుకున్నారట. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు ‘మండలాధీశుడు’ చిత్రం విడుదల కావడంతో జంధ్యాల… కోట శ్రీనివాసరావుతో ఆ పాత్రను చేయించాలని అనుకున్నారు. నిర్మాత డి.రామానాయుడు తొలుత అందుకు ఒప్పుకోలేదు. కానీ, పట్టుబట్టి ఒప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This