కిర్​స్టన్​ సలహాతో మారిన కోహ్లీ బ్యాటింగ్​​!

టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీకి తాను గతంలో ఇచ్చిన సలహా వల్లే, ప్రస్తుతం స్టార్ బ్యాట్స్​మెన్​లో ఒకడిగా కొనసాగుతున్నాడని చెప్పాడు మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టన్. దీనితో పాటే విరాట్​ను తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు.

“నేను కోహ్లీని 2008లో తొలిసారి కలిశాను. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, ప్రతిభ అతడి సొంతం. అయితే దానిని సరైన విధానంలో ఉపయోగించట్లేదని నాకు అనిపించింది. ఈ విషయమై ఇద్దరం చాలాసార్లు చర్చించుకునేవాళ్లం” -గ్యారీ కిర్​స్టన్, భారత మాజీ కోచ్

2008లో భారత్-శ్రీలంక వన్డే సిరీస్​తో కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఈ సిరీస్​లోని ఓ మ్యాచ్​లో అనవసర షాట్​కు ప్రయత్నించి ఔట్ అయిన సందర్భాన్ని గ్యారీ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు విరాట్​కు ఇచ్చిన సలహా వల్ల తర్వాతి వన్డేలో సెంచరీ చేశాడని చెప్పుకొచ్చాడు.

“శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్​ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందులోని ఓ మ్యాచ్​లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, లాంగ్​ ఆన్​లో సిక్స్​ కొట్టాలని ప్రయత్నించి ఔటయ్యాడు. ‘నీ ఆటలోని స్థాయిని పెంచాలంటే బంతిని పైకి లేపకుండా కిందనుంచి కొట్టాలి. నువ్వు ఎన్నిసార్లు పైకి కొడితే అంత ప్రమాదంలో పడతావు’ అని ఆ సమయంలో విరాట్​కు చెప్పాను. దానిని అతడు పాటించడం వల్ల కోల్​కతాలో జరిగిన తర్వాతి మ్యాచ్​లో శతకం సాధించాడు” -గ్యారీ కిర్​స్టన్, భారత మాజీ కోచ్

కిర్​స్టన్.. టీమ్​ఇండియాకు 2008-11 మధ్య ప్రధాన కోచ్​గా పనిచేశాడు. ఆ సమయంలో భారత్ టెస్టుల్లో అగ్రస్థానం సాధించడం సహా వన్డే ప్రపంచకప్(2011)​ను ముద్దాడింది. అనంతరం కోచ్​ బాధ్యతల నుంచి తప్పుకున్న గ్యారీ… దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్​గా పనిచేశాడు. ఐపీఎల్​లోనూ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న బెంగళూరు జట్టుకు రెండేళ్ల పాటు కోచ్​గా సేవలందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This