‘ఇప్పటికైనా రోహిత్​కు టీ20 బాధ్యతలు అప్పగించండి’

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లోనూ టీమ్​ఇండియా పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు వన్డేల సిరీస్​లో రెండింటిలో ఓడి.. కోహ్లీసేన సిరీస్​ను చేజార్చుకుంది. జరిగిన రెండు మ్యాచ్​ల్లోనూ కంగారూలు ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ఆసీస్​ బౌలర్లను ఎదుర్కోవడం సహా వారి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో భారత బౌలర్ల విఫలమయ్యారు. దీంతో కోహ్లీసేనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో​ కోహ్లీ బ్యాటింగ్​లో పర్వాలేదనిపించినా.. కెప్టెన్​గా పూర్తిగా విఫలమయ్యాడని నెటిజన్లు అంటున్నారు. కోచ్​ రవిశాస్త్రి నేతృత్వంతో పాటు కోహ్లీ నాయకత్వంలోని టీమ్​ఇండియా జట్టు పూర్తిగా విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు. భారత జట్టులో నాయకత్వ మార్పు కావాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికైనా టీ20 పగ్గాలను రోహిత్​శర్మకు అప్పగించాలని బీసీసీఐని డిమాండ్​ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This