‘కోహ్లీ సగం జట్టుతో సమానం.. అతడు లేకపోతే’

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు సారథి కోహ్లీ దూరం కావడం టీమ్​ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని మాజీ క్రికెటర్​, కామెంటేటర్ ​సంజయ్​ మంజ్రేకర్​ అభిప్రాయపడ్డాడు. అతడి స్థానంలో అజింక్య రహానెను దింపాలని అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 17న డే/నైట్ పద్ధతిలో తొలి టెస్టు జరగనుంది.

“తొలి టెస్టు తర్వాత కోహ్లీ అందుబాటులో లేకపోవడం భారత్​కు తీరని లోటు. విదేశీ గడ్డపై మన జట్టు దాదాపుగా విరాట్​పైనే ఆధారపడుతుంది. బ్యాటింగ్​ విభాగంలో అతడే సగభాగం. కాబట్టి విరాట్ దూరం కావడం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సిరీస్​ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి భారత ఆటగాళ్లకు ఓ పరీక్ష లాంటిది. విరాట్​ స్థానం(నెం.4)లో అజింక్య రహానెను పంపడమే ఉత్తమం. పుజారా ఆసీస్​తో గత టెస్టు సిరీస్​లో తానేంటో నిరూపించుకున్నాడు. కాబట్టి కోహ్లీ స్థానంలో రహానెకు అవకాశమిస్తే టీమ్​ఇండియాకు లాభదాయకం. విహారిని నెం.5, శుభమన్​ గిల్​ను నెం.6 స్థానంలో పంపడం మంచిదని నా అభిప్రాయం”

-సంజయ్​ మంజేక్రర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న భారత్.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. శుక్రవారం(నవంబరు 27) జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This