కీర్తి సురేశ్​ ‘మిస్‌ ఇండియా’ రివ్యూ

మిస్​ ఇండియా.. టైటిల్‌ చూసి ఇదేదో అందాల పోటీల నేపథ్యంలో రూపొందిన సినిమా అనుకోవద్దు. ‘జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలి… దాన్ని సాధించడానికి ఎంతవరకైనా పోరాడాలి’ అని నిరూపించే కథ ఇది.

చిత్రం: మిస్‌ ఇండియా

సంస్థ‌: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌

న‌టీన‌టులు: కీర్తి సురేశ్‌, జగపతిబాబు, సుమంత్‌ శైలేంద్ర, నవీన్‌చంద్ర, నదియ, నరేశ్‌, కమల్‌ కామరాజు, రాజేంద్రప్రసాద్‌, పూజిత పొన్నాడ, దివ్య శ్రీపాద తదితరులు

కళ: సాహి సురేష్‌

పాటలు: కళ్యాణ్‌ చక్రవర్తి, నీరజ కోన

రచన: నరేంద్రనాథ్‌, తరుణ్‌ కుమార్

కూర్పు: తమ్మిరాజు

ఛాయగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌

సంగీతం: తమన్

నిర్మాత: మహేష్‌ కోనేరు

దర్శకుడు: నరేంద్ర నాథ్‌

విడుద‌ల‌: 04 నవంబర్‌ 2020 (‘నెట్‌ఫ్లిక్స్‌’లో)

కథేంటంటే..

మానస సంయుక్త (కీర్తి సురేశ్‌) చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలని అనుకుంటుంది. ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్‌ స్టార్ట్‌ చేసి తనేంటో ప్రపంచానికి చూపించాలనేది ఆమె కల. ఆమె అనుకున్నట్లే పెద్ద వ్యాపారవేత్త అవుతుంది. అయితే అది ఇండియాలో కాదు… అమెరికాలో. తన తాత విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్‌) నుంచి నేర్చుకున్న హెర్బల్‌ టీ తయారీని వ్యాపారంగా ఎంచుకొని ది బెస్ట్‌ అనిపించుకుంటుంది. అసలు సంయుక్త అమెరికా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వ్యాపారవేత్త అయ్యింది, తను అనుకున్నది ఎలా సాధించింది. ఆమె ప్రయాణంలో విజయ్‌ (నవీన్‌ చంద్ర), సుమంత్‌ శైలేంద్ర (విక్రమ్‌), కైలాష్‌ శివ కుమార్‌ (జగపతిబాబు) పాత్రలు ఏంటి.. అనేదే కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This