సమీక్ష: కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ ఆకట్టుకుందా!

చిత్రం: పెంగ్విన్‌

నటీనటులు: కీర్తి సురేశ్‌, ఆదిదేవ్‌, లింగ, మాస్టర్‌ అద్వైత్‌, నిత్య, హరిణి తదితరులు

సంగీతం: సంతోష్‌ నారాయణ్‌

సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ పళని

ఎడిటింగ్‌: అనిల్‌ క్రిష్‌

నిర్మాత: కార్తీక్‌ సుబ్బరాజ్‌, కార్తికేయన్‌ సంతానం, సుధాన్‌ సుందరమ్‌, జయరామ్‌

రచన, దర్శకత్వం: ఈశ్వర్‌ కార్తీక్‌

బ్యానర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

వేసవి అంటే వినోదాల సందడి. వారానికో కొత్త సినిమా చూస్తూ అందరూ సెలవులను ఆస్వాదించేవారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం వల్ల థియేటర్లు మూతపడ్డాయి. ఎంతో ఉత్సాహంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో కరోనా చిత్ర పరిశ్రమ ఆశలపై నీళ్లు చల్లింది. అదే సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావడం వల్ల ఓటీటీలకు అలవాటు పడ్డారు. దీంతో దర్శక-నిర్మాతల చూపు ఓటీటీలవైపు మళ్లింది. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలకు ఏడారిలో ఒయాసిస్‌లా ఓటీటీ దొరికింది. ‘అమృతారామమ్‌’, ‘పొన్‌ మగళ్‌ వందాళ్‌’, ‘గులాబో సితాబో’ సహా పలు చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు కీర్తిసురేశ్‌ ‘పెంగ్విన్‌’ ఓటీటీ బాట పట్టింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఒక థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో నటించారు. దీంతో ‘పెంగ్విన్‌’పై అంచనాలు పెరిగాయి. మరి తొలి థ్రిల్లర్‌లో కీర్తిసురేశ్‌ ఎలా నటించారు? ఈశ్వర్‌ కార్తీక్‌ ఎలా తెరకెక్కించారు? అసలు ‘పెంగ్విన్‌’ కథేంటి? అనే విషయాలు సమీక్షలో తెలుసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This