ప్రతి ప్రాణాన్నీ కాపాడాలి.. నిరంతరం పర్యవేక్షణ ఉండాలి: కేసీఆర్‌

వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయని, అన్ని జలాశయాల్లో నీరు వస్తోందని… ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాబోయే మూడు, నాలుగు రోజులు చాలా ముఖ్యమని.. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం… అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిపై… ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జలవనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రహదారులు –భవనాలు తదితర శాఖలకు చెందిన అధికారులతో సీఎం సమావేశమయ్యారు.

మరింత అప్రమత్తంగా…

గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు… నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నందున.. రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి.. పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆయా ప్రాంతాల్లో.. చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్.. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి… ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరదల ఉద్ధృతి ఎక్కువున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This