కశ్మీర్​లో 30 గంటల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

మరో ఉగ్రవాది హతం…

కశ్మీర్​ పోషియాన్​ జిల్లా మరో ఉగ్రవాది హతమయ్యాడు. మునాంద్​ ప్రాంతంలో గురువారం నుంచి చేపట్టిన ఆపరేషన్​లో మొత్తం ఐదుగురిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. పుల్వామాలో మరో ముగ్గురిని హతమార్చాయి.

గడచిన 30 గంటల్లో ఈ రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో మొత్తం 8 మంది ముష్కరులు హతమయ్యారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల కోసం భారీ ఆపరేషన్​ను చేపట్టాయి భద్రతా దళాలు. పుల్వామా, షోపియాన్​లలో వేర్వేరు చోట్ల ఎన్​కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం ఏడుగురిని మట్టుబెట్టాయి.

పుల్వామా జిల్లా పొంపోర్​ మీజ్​ ప్రాంతంలో గురువారం ఒక ముష్కరుడిని హతమార్చిన భద్రతా సిబ్బంది.. ఇవాళ మరో ఇద్దరిని అంతమొందించారు. మసీదుల్లో నక్కిన ఉగ్రవాదులను వేటాడి మరీ చంపారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

మరోవైపు షోపియాన్​ జిల్లా మునాంద్​ ప్రాంతంలోనూ ఆర్మీ ఆపరేషన్​ గురువారం నుంచీ కొనసాగుతోంది. ఇక్కడ గురువారం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఇవాళ మరో ముగ్గురిని హతమార్చగా.. ఈ ఆపరేషన్​లో మొత్తం నలుగురు ముష్కరులు చనిపోయారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This