కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు పంజా విసిరాయి. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో వీరిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

ఉగ్రవాద కదలికలపై అందిన సమాచారంతో జిల్లాలోని కుత్పొరా ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని అధికారులు వెల్లడించారు. బలగాలను గమనించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డాయని తెలిపారు. దీంతో భద్రతా దళాలు సైతం దీటుగా స్పందించినట్లు చెప్పారు. మృతి చెందిన ఇద్దరు ముష్కరులను గుర్తించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This