కాశి లో మైసూరు శ్రీ అవధూత దత్త పీఠాధిపతి

అలాగే ఒకటి రెండు రోజుల్లో మరింత భక్తులు రద్దీ పెరిగి వేలాది తరలి రావచ్చునని దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు ఆశ్రమ వర్గాల వారు అభిప్రాయపడ్డారు

గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చేస్తున్న అతిరుద్ర యాగం ఈ నెల 13-11-19 నుండి 24-11-19 వరకు గంగా నదీ తీరాన శివానీ ఘట్ నందు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారతదేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఈ అతిరుద్ర యాగంలో పాల్గొనడానికి కన్నులారా స్వయంగా కార్యక్రమాన్ని వీక్షించడానికి అనేక వేలమంది భక్తులు ఇప్పటికే కాశీకి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని
భక్తిశ్రద్ధలతో పాలుపంచుకున్నారు.

ఈరోజు ఉదయం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు , శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మరియు 109 మంది వేద రుత్విక్ లతో పవిత్ర గంగానదిలో పుణ్య స్నానాలు గావించి అక్కడి నుండి పవిత్ర గంగ ని తీసుకు వచ్చిన యాగశాల ప్రాంగణమంతా పుణ్యా వచనం చేసి ఆచ్ఛట నెలవైవున కాశి శివలింగానికి రుద్రాభిషేకం చేసి అనంతరం అతిరుద్ర యాగంనికి శ్రీకారం చుట్టారు.

రుద్రాభిషేకం అనంతరం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్యన  అగ్ని స్థాపన చేసి అతిరుద్ర యాగాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు  శ్రీకారం చుట్టారు

అనంతరం 10 గంటలకు  శ్రీ పార్వతి దేవి అమ్మవారి కి  శ్రీ చక్ర పూజ వరలక్ష్మి పూజ అష్టలక్ష్మి పూజ గోపూజను  శ్రీ గణపతి సచ్చిదానంద
స్వామీజీ వారు చేసి అనంతరం 11 గంటల 30 నిమిషాల భక్తులందరికి శ్రీ స్వామీజీ వారు హోమవిభూతి ని ప్రసాదంగా ఇస్తూ ప్రతి రోజు స్నానం అచరించేటప్పుడు చిటికెడు హోమవిభూతి ని మరియు పవిత్ర కాశి గంగ ను కొద్దిగా బకెట్లో లో వేసుకొని స్నానం చేయటం వలన అనేక జబ్బులు ఉన్న వారు స్వాంతన పొందుతారని తేలియచేసారు.
పవిత్ర కార్తీకమాసంలో అందునా పుణ్య కాశీ క్షేత్రంలో ఇటువంటి అరుదుగా జరిగే అతిరుద్ర యాగం పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటూ కాశీనాధుని స్మరిస్తూ దర్శించుకుంటూ పాల్గొన్న వారందరికీ అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు భక్తులనుద్దేశించి ప్రసంగించారు

శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు పర్యవేక్షణలో  వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఆ కాశి క్షేత్రం మంతా శివనామ స్మరణతో మార్మోగింది

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈరోజు అనుగ్రహ భాషణ రుద్ర భాష్యం పురాణం చేపారు ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వేలాది మంది భక్తులకు ఉచిత భోజన వసతిని అలాగే ఉచిత విడిది వసతి సౌకర్యం ఆశ్రమం కార్యవర్గం చక్కటి ఏర్పాటులను చేసారు.

ప్రత్యేకించి ఆంధ్రా నుంచి వెయ్యి మంది వంట బ్రాహ్మణులతో అత్యంత సుచ్చిగా రుచికరమైన భోజనాలను ప్రతి ఒక్కరికి అందజేశారు. అలాగే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన వారందరికీ ఉచిత వైద్య సౌకర్యాలని కూడా అందజేస్తున్నారు .

ఈనెల నవంబర్ 24వ తేదీ వరకు జరిగే ఈ అతిరుద్ర యాగం నందు అనేక మంది భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తులకి
ఉచిత వసతి భోజనాలను
సౌకర్యాలను కల్పిస్తూ ఆశ్రమ కమిటీ వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా కాశీ పట్టణ పోలీస్ శాఖ వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వారు ప్రభుత్వం యత్రాగం వారు ప్రతి నిమిషము అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఎటువంటి అసౌకర్యాలకి భక్తులు
గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలాగే ఒకటి రెండు రోజుల్లో మరింత భక్తులు రద్దీ పెరిగి వేలాది తరలి రావచ్చునని దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు ఆశ్రమ వర్గాల వారు అభిప్రాయపడ్డారు

అలాగే ఈ కార్యక్రమానికి పాల్గొనటానికి వచ్చిన లక్షలాదిమంది భక్తులకు అసౌకర్యం కలగకుండా అందరికి కూడా సౌకర్యాలను సమకూరుస్తూ వారికి సేవలు అందిస్తూ వారికి ఉచితంగా మందులు పంపిణీ ఆరోగ్య వైద్య సేవలు ఉచిత వసతి సౌకర్యం ఉచిత భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి దాదాపు 7,500 మంది దత్త వాలంటీర్లు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు భక్తులకు సేవలందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This