కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- 11మంది మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- 11 మంది మృతి

కర్ణాటక ధార్వాడ్​ జిల్లా ఇట్టిగట్టి  గ్రామ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సును టిప్పర్​ లారీ ఢీకొంది. ఈ ఘటనలో 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.  క్షతగాత్రులను హుబ్లీలోని కిమ్స్​ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మినీబస్సు దేవనగర్​ నుంచి బెళగావికు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This