వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, భూ సంస్కరణల ఆర్డినెస్స్, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) సవరణలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. అఖిల భారత కిసాన్​ సభ(ఏఐకేఎస్​) సహా ఇతర సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. రోడ్లపై ఆందోళనలు నిర్వహించాయి.

ఆందోళనలలో భాగంగా బైక్ ర్యాలీలు నిర్వహించాయి రైతు సంఘాలు. పలు చోట్లు రోడ్లపై బైఠాయించి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు తెరిచిన యజమానుల వద్దకు వెళ్లి బంద్​కు మద్దతు తెలుపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This