సాఫ్ట్ పోర్న్ సినిమాలు తీస్తున్నారు, కరణ్ జోహార్ లాంటివారిని శిక్షించండి

వివాదం అన్న పదానికి మారు పేర్లు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్. వీరిద్దరూ ఏం చేసినా అది వివాదాస్పదమైపోతుంది. సాధారణంగా ఇతర సెలబ్రిటీలపై కామెంట్లు చేసేవారు వారి పేర్లను బయటికి చెప్పకుండా కామెంట్లు చేస్తుంటారు. కానీ రంగోలీ అలా కాదు. వారి పేర్లతో సహా బయటపెట్టి నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె చెప్పే మాటల్లో కూడా లాజిక్ ఉందనే అనిపిస్తుంది. తాజాగా రంగోలీ మరోసారి వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ తీయబోతున్న సినిమాపై మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాముడి గురించి గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రంగోలీ స్పందిస్తూ.. ‘మన చిన్నప్పుడు టెస్ట్ బుక్స్‌లో బాబర్ గురించి ఎన్నో కథలు చదివాం. కానీ బాబర్ లాంటి వెధవను రాముడితో పోల్చే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు’ అన్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మీరు చిన్నప్పుడు బాబర్ గురించి ఏం చదివారో చెప్తారా?’ అని ప్రశ్నించాడు. ఇక్కడి నుంచి రంగోలీ వరుసగా ట్వీట్లు చేస్తూ ఎప్పటిలాగే అటు తిరిగి ఇటు తిరిగి కరణ్ జోహార్‌ను టార్గె్ట్ చేసింది.

‘మా హిమాచల్ ప్రదేశ్ బోర్డ్ హిస్టరీలో బాబర్ అరాచకాలను వివరిస్తూ ఎన్నో చాప్టర్స్ ఉండేవి. బాబర్ కొడుకు హుమాయున్. వారి పాలన ఎలా ఉండేది. తమ భార్యలను ఎలా హింసించేవారు ఇవన్నీ చదివాం. ఆ తర్వాత కొందరు అతివాదులు బాబర్‌ను గొప్ప వ్యక్తిగా, రాముడిని కల్పితంగా మార్చేశారు. ఓ హంతకుడిని గొప్ప వ్యక్తిని చేస్తే ఈ దేశం ఏమైపోతుంది? ఇప్పుడు కరణ్ జోహార్ గారు తఖ్త్ సినిమా పేరుతో ఔరంగ్‌జేబ్ లాంటి వెధవ గురించి చూపించాలనుకుంటున్నారు. అతనికి ఎన్ని అక్రమ సంబంధాలున్నాయి అని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఇలాంటి పనికిమాలిన దర్శకులు ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ దేశాన్ని కించపరిచే ముందు చరిత్రలోని పాత్రలను తెరపై చూపిస్తూ వారికి ఎన్ని ఎఫైర్స్ ఉన్నాయో చూపించడం మానుకోవాలి. కాబట్టి ఏదన్నా సినిమా తీసే ముందు వారు రాసుకున్న స్క్రిప్ట్స్ పరిశీలించే కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇలాంటి డ్రామా సినిమాలను తీసే దర్శకులపై కఠిన రూల్స్ పెట్టాలి. ఎవ్వరూ రాముడిని కల్పిత పాత్ర అనడానికి వీల్లేదు. రాముడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఎవ్వరూ తక్కువ చేసి చూడకూడదు. ఇక రామరాజ్యం విషయానికొస్తే.. కృష్ణుడు, శివుడిలా కాకుండా రాముడు తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This