క్వారంటైన్​ నుంచి కంగనా రనౌత్​కు మినహాయింపు

ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్​తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​.. బుధవారం అదే నగరానికి చేరుకుంది. అయితే నిబంధనల ప్రకారం ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తే 14 రోజులు క్వారంటైన్​లో ఉండాలి. కానీ ఈ విషయంలో కంగనకు మినహాయింపు ఇచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ముంబయిలో కంగన కొన్నిరోజులు మాత్రమే ఉండేందుకు వచ్చినట్లు ఆన్​లైన్​ అప్లికేషన్ పెట్టారని, దీంతో ఆమెకు ‘షార్ట్ టెర్మ్ విజిటర్ కేటగిరీ’లో భాగంగా మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 14న హిమాచల్ ప్రదేశ్​కు తిరుగు ప్రయాణం కానుందీ నటి.

అంతకు ముందు ముంబయిలోని కంగనా​ నివాసానికి మంగళవారం నోటీసులు జారీ చేసిన బీఎమ్​సీ అధికారులు.. బుధవారం దానిని పాక్షికంగా కూల్చివేశారు. దీంతో కంగన హైకోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం అక్రమ నిర్మాణం కూల్చివేత విషయంపై స్టే ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This