కాచిగూడలో ఎంఎంటీఎస్, కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఢీ

హైదరాబాద్​ కాచిగూడ రైల్వేస్టేషన్‌ లో పెను ప్రమాదం తప్పింది. ఎంఎంటీఎస్, కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కాచిగూడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  రైల్వే అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ట్రాక్​పై  ఓ రైలు నిలిచి ఉన్నప్పుడు మరో రైలుకు ఎలా సిగ్నల్ ఇస్తారని  అధికారులను ప్రశ్నించారు. రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఆగివున్న కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్‌ రైలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This