జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఘటనాస్థలంలో ఏకే రైఫిల్​ను స్వాధీనం చేసుకున్నాయి.

లర్నూ ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో శనివారం ఉదయం.. నిర్బంధ తనిఖీలు చేపట్టింది సైన్యం. ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా సిబ్బంది.. ఓ ముష్కరుడిని హతమార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This