పుల్వామాలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ స్వాధీనం

జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని తుజన్​ గ్రామంలో ఓ వంతెన కింద ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

కశ్మీర్​లో భద్రతా దళాల వాహనాలే లక్ష్యంగా ముష్కురులు రోడ్లు, రహదారుల వెంబడి ఐఈడీలు అమర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా చర్యలు చేపట్టారు. స్నిఫర్​ డాగ్స్, ఎలక్ట్రానిక్​ పరికరాలతో రోడ్లు, రహదారుల వెంబడి ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఈ నెల మొదట్లోనూ బారాముల్లా జిల్లా పత్తన్​ ప్రాంతంలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రతా దళాలు. పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న దీనిని 29వ రాష్ట్రీయ రైఫిల్స్ స్వాధీనం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This