‘జగన్ చెవిలో ఆ మాట చెప్పండి విజయసాయిరెడ్డి గారు’

జగన్ సర్కార్ తీసుకొచ్చిన 2430 జీవోపై రగడం కొనసాగుతోంది. మీడియా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందంటూ జర్నలిస్టు సంఘాలు, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటూ జనసేన, బీజేపీతో పాటూ ఇతర పార్టీలు ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. అంతేకాదు ఈ జీవో అంశాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా కేసు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగన్ సర్కార్‌పై టీడీపీ నుంచి ఎదురు దాడి కొనసాగుతోంది.

2430 జీవోపై ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్‌గా సెటైర్లు పేల్చారు. ‘విజయసాయి రెడ్డి గారూ.. ముఖ్యమంత్రి చెవిలో చెప్పండి ప్రజాస్వామ్యమంటే “నా శత్రువు నోరు విప్పకుండా చేసే బలం, బలగం, అధికారం నాకున్నప్పటికీ.. అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్సలైన సరే.. అదే ప్రజా స్వామ్యం” అబ్రహం లింకన్.అర్ధమైనదా’అన్నారు. వర్ల రామయ్య తన ట్వీట్‌లో అబ్రహం లింకన్ చెప్పిన మాటను ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డికి గుర్తు చేశారు.

2430 జీవో ఏంటంటే

జగన్ సర్కార్ 2430 జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపైపా చర్యలు తప్పవు. ఈ వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా విభాగాల (ప్రభుత్వశాఖల) కార్యదర్శులకు అప్పగించారు. కొత్త జీవో ప్రకారం.. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు న్యాయపరంగా కేసులు దాఖలు చేస్తారు.

ఈ జీవోకు ఈ నెల 16న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపగా.. తాజాగా జీవోను విడుదల చేశారు. ఈ జీవోపై జర్నలిస్టు సంఘాలతో పాటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మీడియా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This