జనవరి 4న ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని బాధ్యతలు!

పదవీ విరమణ చేసిన ఏపీ మాజీ సీఎస్ నీలం సాహ్నికి సచివాలయంలో సాధారణ మొదటి బ్లాక్ లోని గ్రీవెన్స్ సెల్​లో ఉద్యోగులు , ఐఎఎస్ అధికారులు వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఆమె సేవల్ని అధికారులు కొనియాడారు. మరోవైపు విధుల్లో తనకు సహకరించిన ఉద్యోగులు, అధికారులకు నీలం సాహ్ని ధన్యవాదాలు తెలియచేశారు. జనవరి 4 తేదీన ఆమె ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రామ సచివాలయాలు, కొవిడ్ 19 నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఆమెకు సూచించింది.

నీలం సాహ్నికి ఎల్​టీసీ రీయింబర్స్మెంట్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నికి 2018-21కి సంబందించిన లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్​టీసీ) లీవ్ ఎన్​క్యాష్​మెంట్ మొత్తాన్ని రీయింబర్స్ చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలంలో ఎల్​టీసీ వినియోగించుకోని అఖిలభారత సర్వీసుల అధికారులకు కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్​మెంట్​కి అవకాశం కల్పించింది. నీలం సాహ్ని కొన్ని గృహాపకరణాలు కొనుగోలు చేశారని, ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని ఆమె వ్యక్తిగత కార్యదర్శి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This