‘ఎవరు అధ్యక్షుడైనా… ఇరాన్​కు తలొగ్గాల్సిందే!’

అమెరికా అధ్యక్ష పోరులో ఎవరు గెలిచినా… ఇరాన్​కు వారు తలొగ్గాల్సిందేనని అన్నారు ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ. ఓ వాటర్​ పైప్​లైన్​ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

” నేడో..రేపో.. అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. కానీ, మాకు ఎవరు అధ్యక్షుడవుతారనేది ముఖ్యం కాదు. పోరులో ఎవరు నెగ్గినా వారు ఇరాన్​ ప్రజలకు తలొగ్గాల్సిందే “.

హసన్​ రౌహాని, ఇరాన్ అధ్యక్షుడు.

ట్రంప్​పై ఆగ్రహం…

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ట్రంప్​ తమ దేశంపై కఠిన ఆంక్షలు విధించారని రౌహానీ మండిపడ్డారు. అమెరికా నేతలు ఎలాంటి నియమాలకు కట్టుబడి ఉండరని ధ్వజమెత్తారు. మానవ హక్కులు, విదేశీ వ్యవహారాల చట్టాలు, నియమనిబంధనలతో వారికి పనిలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This