ఐపీఎల్2020: నెట్టింట ధోనీ అభిమానుల సందడి

మరికొన్ని గంటల్లో ఐపీఎల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సోషల్ ​మీడియాలో అభిమానుల​ సందడి మొదలైంది. నేడు రాత్రి 7.30గంటలకు ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. అయితే ఈ లీగ్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ధోనీ. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన మహీ.. ఐపీఎల్​తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ తరుణం కోసమే అతడి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​ వేదికగా ‘ధోనీ ఈజ్​ బ్యాక్’​, ‘వెల్కమ్​ బ్యాక్​ మై డియర్​ తాలా’ వంటి హ్యాష్ ట్యాగ్​తో మహీ అభిమానులు సందడి చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This