ఐపీఎల్​ : అద్భుతంగా మెరిశారు.. అంతలోనే తుస్సుమనిపించారు

ఐపీఎల్​.. ఏ ఆటగాడైనా తన ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కని వేదిక. ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో సహా అన్ని దేశాల క్రికెటర్లు ఈ మెగాలీగ్​ కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తుంటారు. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీ ద్వారానే రవిచంద్రన్​ అశ్విన్​, జస్ప్రీత్​ బుమ్రా సహా ఎంతోమంది స్టార్​ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. మైదానంలో చెలరేగిపోతున్నారు.

అయితే కొందరు మాత్రం ఒక్క సీజన్​తోనే ఆకాశమంతా స్టార్​డమ్​ సంపాదించుకున్నారు. బరిలో దిగితే ఆట రూపురేఖలే మార్చేస్తారనేలా కీర్తి గడించారు. దీంతో తర్వాతి సీజన్​ల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూడటం ప్రారంభించారు. కానీ వారు మాత్రం పేలవ ప్రదర్శనతో వీక్షకులకు నిరాశను మిగిల్చారు. కొందరైతే ఏకంగా కనుమరుగైపోయారు. ఇంతకీ వారెవరు? సాధించిన అద్భుతమైన గణాంకాలేంటి?

పాల్​ వల్తాటి

పాల్​ వల్తాటి.. 2011లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​కు ఆడాడు. ఆ ఏడాది 35.61 స్ట్రైక్​రేట్​తో 14 మ్యాచుల్లో 463 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 120. ఎవరు ఊహించని విధంగా సీఎస్కేపై 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు సాధించాడు. కానీ ఆ జోరును తదుపరి సీజన్​లో కొనసాగించలేకపోయాడు. 2012లో కేవలం ఆరు మ్యాచులు ఆడగా.. 2013లో ఒక్కటి ఆడాడు. ప్రస్తుతం ఎయిర్​ ఇండియా తరఫున ఆడుతున్నాడు.

రాహుల్​ శర్మ

యువ స్పిన్నర్​ రాహుల్​ శర్మ(డెక్కన్​ ఛార్జర్స్​)ను అందరూ​ అశ్విన్​తో పోల్చేవారు. 2011 సీజన్​లో సచిన్ వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే ఏడాది 17.06 స్ట్రైక్​రేట్​తో 14 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి జాతీయ జట్టులో చోటు లభించింది. నాలుగు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు.

కానీ అనుకోని రీతిలో మాదక ద్రవ్యాలు సేవించి జాతీయ జట్టులో నిషేధానికి గురయ్యాడు. చివరగా 2012లో శ్రీలంకతో జరిగిన సిరీస్​లో పాల్గొన్నాడు. ప్రస్తుతం పంజాబ్​లోని అంతర్​ జిల్లా మధ్య జరిగే మ్యాచులు ఆడుతున్నాడు. పంజాబ్​ తరఫున దేశవాళీ క్రికెట్​లో పునరాగమనం చేయాలని యోచిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This