దిల్లీతో మ్యాచ్​లో ముంబయి జట్టు రికార్డులు

దుబాయ్‌లో గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయర్​లో ముంబయి ఇండియన్స్ పలు రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, దిల్లీ 143/8కే పరిమితమైంది. దీంతో మొత్తం మీద ఆరోసారి ఫైనల్లో ముంబయి అడుగుపెట్టింది.

మ్యాచ్​లో నమోదైన రికార్డులు

  • 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ.. పరుగుల ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌ వేసిన బౌల్ట్‌.. పృథ్వీషా(0), అజింక్య రహానె(0)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో తొలి ఓవర్‌ను డబుల్‌ వికెట్‌ మెయిడిన్‌గా నమోదు చేసి రికార్డు సృష్టించాడు. మరోవైపు రెండో ఓవర్‌ వేసిన బుమ్రా.. ధావన్‌(0)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో 0 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది దిల్లీ. ఈ లీగ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
  • పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముంబయి పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్ నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టిన అతడు పవర్‌ప్లేల్లో 14 తీశాడు.
  • ఈ లీగ్‌ చరిత్రలో ముంబయి ఇప్పటివరకు పదిసార్లు మొదట బ్యాటింగ్ చేసి 200కిపైగా పరుగులు సాధించింది. ప్రతిసారి ఆ జట్టు విజయం సాధించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This