2015 తర్వాత ముంబయి ఇండియన్స్ మళ్లీ ఇప్పుడే!

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​పై ముంబయి విజయం సాధించింది. అయితే 2015 తర్వాత ఆ జట్టుపై రోహిత్​సేన ఇప్పుడే గెలిచింది. మధ్యలో రెండేళ్ల పాటు(2016-17) రాజస్థాన్ రాయల్స్ నిషేధం ఎదుర్కొంది.

మ్యాచ్​ సాగిందిలా

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 193/4 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(35), సూర్యకుమార్(79), హార్దిక్ పాండ్య(30) ఆకట్టుకున్నారు. ఛేదనలో 136 పరుగులకే రాజస్థాన్ ఆలౌటైంది. బట్లర్(70) ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది.

ఐపీఎల్​లో సూర్యకుమార్ అత్యధిక స్కోరు

ముంబయి భారీ స్కోరు చేయడంలో సూర్యకుమార్ కీలకంగా నిలిచాడు. 47 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్​గా నిలిచి, టోర్నీలో ఎనిమిదో అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఇదే ఇతడి అత్యధిక స్కోరు. ఇంతకు ముందు కూడా రాజస్థాన్​పైనే 72 పరుగులు చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This