షార్జాలో ఉన్నామనుకున్నారు.. అందుకే ఓడిపోయాం!

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్​ రాయల్స్​కు బ్రేకులు పడ్డాయి. దుబాయ్​లో కోల్​కతా జట్టు​తో జరిగిన మ్యాచ్​లో 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే దుబాయ్ పరిస్థితులకు తమ ఆటగాళ్లు అలవాటు పడలేదని, ఇంకా షార్జాలోేన ఉన్నట్లు భావించారని రాజస్థాన్​ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్ చెప్పాడు.​ ఈ క్రమంలోనే టాప్​ ఆర్డర్​ వికెట్లు కోల్పోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. గత మ్యాచ్​లో పంజాబ్​పై 224 పరుగుల లక్ష్య ఛేదనను సులభంగా పూర్తి చేసింది రాజస్థాన్.

“ప్రణాళిక ప్రకారం విజయవంతం కాలేకపోయాం. టీ20ల్లో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంది. ముందుగానే వికెట్లు కోల్పోవడం జట్టుకు పెద్ద సమస్య. మాలో కొంతమంది ఇంకా షార్జాలో ఆడుతున్నామని అనుకున్నారు. నిజానికి జట్టు సభ్యులు ఇంకా స్టేడియం వాతావరణానికి అలవాటు పడలేదు”

స్టీవ్​ స్మిత్​, రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​

రాజస్థాన్ తర్వాతి మ్యాచ్​ బెంగళూరు జట్టుతో ఆడనుంది. అక్టోబరు 3న భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This