ఐపీఎల్​2020: ఈసారి ఈ రికార్డులు చెదిరిపోతాయా?

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ లీగ్​లో ఇప్పటివరకు నమోదైన రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత ఘనతలపై ఓ లుక్కేద్దాం.

3

ఐపీఎల్‌ మ్యాచ్‌లు విదేశాల్లో జరగడమిది మూడోసారి. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో పూర్తి సీజన్‌ దక్షిణాఫ్రికాలో, 2014లో తొలి 20 మ్యాచ్‌లు యూఏఈలో జరిగాయి.

263

2013లో పుణె వారియర్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్కోరిది. ఐపీఎల్‌ చరిత్రలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే.

49

ఓ జట్టు అత్యల్ప స్కోరిది. ఈ రికార్డూ బెంగళూరు పేరిటే ఉంది. 2017లో కోల్‌కతాతో మ్యాచ్‌లో ఈ పేలవ రికార్డు ఖాతాలో వేసుకుంది.

109

ఐపీఎల్‌లో అత్యధికంగా, ముంబయి సాధించిన విజయాలు. ఆ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్‌లు 188. 166 మ్యాచ్‌ల్లో 100 విజయాలతో చెన్నై రెండో స్థానంలో ఉంది.

5,412

ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్న కోహ్లీ పరుగులు. సురేశ్‌ రైనా (5,368), రోహిత్‌ శర్మ (4,898) వరుసగా ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారు.

973

ఓ సీజన్‌లో బ్యాట్స్‌మన్‌ చేసిన అత్యధిక పరుగులు. ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లీ 2016లో ఈ ఘనత అందుకున్నాడు.

326

ఐపీఎల్‌లో క్రిస్‌గేల్‌ బాదిన సిక్సర్లివి. అత్యధిక సిక్సర్ల జాబితాలో అతను అగ్రస్థానంలో ఉన్నాడు. డివిలియర్స్‌ (212), ధోనీ (209) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

175

ఐపీఎల్‌లో ఓ ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరిది. 2013లో పుణెపై గేల్‌ సాధించాడు. ఇదే మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన శతకం (30 బంతులు) రికార్డునూ నెలకొల్పాడు.

6

లీగ్‌లో గేల్‌ శతకాలు. అగ్రస్థానం అతడిదే. కోహ్లీ (5), వార్నర్‌ (4) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అత్యధిక అర్ధశతకాల రికార్డు వార్నర్‌ (44) పేరు మీద ఉంది.

192

ఐపీఎల్‌లో రైనా ఆడిన మ్యాచ్‌లు. ఇది లీగ్‌ రికార్డు. ఈ సీజన్‌కు అతను దూరం కావడం వల్ల ధోనీ (189), రోహిత్‌ శర్మ (188), దినేశ్‌ కార్తీక్‌ (182), కోహ్లీ (177) అతణ్ని దాటే అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This