దేశంలో 24 గంటల్లోనే 7964 కేసులు, 265 మరణాలు

భారత్​లో కొవిడ్-19​ మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,964 మందికి వైరస్ సోకింది. మరో 265 మంది వైరస్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మొత్తం మృతుల సంఖ్య 4,971కు పెరిగింది.

కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్​-19 బాధితుల సంఖ్య లక్షా 73 వేలకు చేరువైంది. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్​ తొమ్మిదో స్థానంలో ఉంది.
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,098 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 62,228కి చేరింది. మొత్తం గుజరాత్​లో 15,934, మధ్యప్రదేశ్​లో 7,645 మంది వైరస్​ బారినపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This