ఈ భారతీయ ‘ప్రపంచ’ అందాలకు ఫిదా అవ్వాల్సిందే!

భారతదేశం భూతలస్వర్గమని ఎందరో కవులు వర్ణించారు. ప్రపంచంలో పేరుగాంచిన అందాలను తలదన్నేలా మన మాతృభూమిలో కొన్ని ప్రదేశాలు, కట్టడాలు, ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మితీరాలి. దేశదేశాలు తిరిగేయాలని కలలు కనే యాత్రికులు… దేశంలోని ఈ ప్రదేశాలు చూస్తే ప్రపంచాన్ని చుట్టేసినట్టే.

కరోనా కారణంగా విదేశాలు వెళ్లడం ఇప్పట్లో కష్టమే. ఒకవేళ దేశంలో పర్యటించే అవకాశం వస్తే ఇవన్నీ చూసేయండి. ఎందుకంటే ఈ 11 ప్రదేశాలు అచ్చం విదేశాల్లోని ప్రముఖ ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోవు. ఇంతకీ అవి ఏంటో తెలుసుకుందామా!

అలప్పుజ-వెనిస్‌

వెనిస్‌లో పడవ షికారుకు వెళ్లాలనుకునే ముందు ఒకసారి కేరళలోని అలప్పుజకు వెళ్లండి. అక్కడ బ్యాక్‌ వాటర్‌లో.. హౌస్‌బోట్‌లో షికారు చేస్తుంటే ఎవరైనా ప్రకృతికి దాసోహమైపోతారు. వెనిస్‌కు ఏ మాత్రం తీసిపోని అలెప్పీ అందాలకు పర్యటకులు మంత్రముగ్ధులవ్వాల్సిందే. అందుకే అలప్పుజను ‘వెనిస్‌ ఆఫ్ ద ఈస్ట్‌’గా పిలుస్తారు.

రణ్‌ ఆఫ్‌ కచ్‌- సాల్ట్‌ లాండ్స్‌ ఆఫ్ ఉటా

సాల్ట్‌ లాండ్స్‌ చూడటం కోసం ఉటా వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. గుజరాత్‌లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌కు వెళ్లండి. ఈ రెండు ప్రదేశాల్లో మీరు ఒకే తరహా అనుభూతి పొందుతారు. చలికాలంలో దీని అందం రెట్టింపు అవుతుంది. ఈ ప్రాంతానికి నవంబర్‌ రెండో వారం నుంచి ఫిబ్రవరి వరకు యాత్రికుల తాకిడి ఎక్కువ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This