‘భారత్​ ఎలా గెలిచిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు’

ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమ్​ఇండియాను ప్రశంసించాడు ఆసీస్​ మాజీ సారథి రికీ పాంటింగ్​. సిరీస్​ గెలవడానికి భారత్​కు అర్హత ఉందని అన్నాడు. అయితే టీమ్​ఇండియా గెలవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు.

“ఆస్ట్రేలియాపై భారత్​ నెగ్గడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సిరీస్​ గెలవడానికి భారత్​కు అర్హత ఉంది. తొలి టెస్టు తర్వాత టీమ్​ఇండియాకు సారథి కోహ్లీ గైర్హాజరీ, ఎక్కువ గాయాలు వెంటాడాయి. మరోవైపు ఆసీస్​కు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. వార్నర్​ చివరి రెండు మ్యాచులకు అందుబాటులోనే ఉన్నాడు. అయినా మా గడ్డపై వారు ఎలా గెలిచారో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఏదేమైనప్పటికీ టీమ్​ఇండియా కీలక సమయాల్లో బాగా ఆడింది. కానీ ఆసీస్​ అలా చేయలేకపోయింది. అదే ఇరు జట్లకు తేడా.”

-పాంటింగ్​, ఆసీస్​ మాజీ సారథి.

2-1తేడాతో టెస్టు సిరీస్​ను సొంతం చేసుకుని.. చారిత్రక విజయాన్ని నమోదు చేసింది టీమ్​ఇండియా. దీంతో సర్వత్రా భారతజట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This