హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు అసెంబ్లీ స్పీకర్​!

రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తిరుగుబాటు నేత సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర స్పీకర్​ సీపీ జోషి. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో స్పెషల్​ లీవ్​ పిటిషన్​(ఎస్​ఎల్​పీ) దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

“షోకాజ్​ నోటీసులు పంపే పూర్తి అధికారం స్పీకర్​కు ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేయమని మా న్యాయవాదిని కోరాను. స్పీకర్​ బాధ్యతలు సుప్రీం కోర్టు, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించాయి. స్పీకర్​గా నాకు ఓ దరఖాస్తు వచ్చింది. దానిపై సమాచారం తెలుసుకోవాలనుకునే షోకాజ్​ నోటీసులు జారీ చేశాను. ఉన్న అధికారంతో నోటీసులు ఇవ్వకపోతే.. ఇకా ఆ అధికారం ఎందుకు?”

– సీపీ జోషి, రాజస్థాన్​ అసెంబ్లీ స్పీకర్​

విప్‌ ధిక్కరించి శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైన పైలట్ సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు.

స్పీకర్​ నోటీసులను సవాల్​ చేస్తూ సచిన్​ పైలట్​ వర్గం దాఖలు చేసిన పిటిషన్​పై మంగళవారం(జులై 21న) విచారణ జరిపి.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. అనర్హత వేటుపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This